హైదరాబాద్: 28°C
వార్తలు

కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం

కోల్‌కతాలోని రద్దీ ప్రాంతమైన ముల్లిక్ బజార్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అక్కడి ఓ మూడంతస్తుల భవనంలోని దుస్తుల గోడౌన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో మంటలు భారీగా ఎగసిపడటంతో పాటు పరిసర ప్రాంతాల్లో దట్టంగా పొగ అలుముకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ఐదు ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.