హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఛలో హైదరాబాద్‌ విజయవంతం చేయాలి: సీపీఐ

BDK: డిసెంబర్ 29న ఛలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కెచ్చెల రంగారెడ్డి పిలుపునిచ్చారు. దమ్మపేట మండలం లింగాలపల్లిలో జరిగిన పాల్వంచ డివిజన్ సమావేశంలో మాట్లాడారు. పోడు, అసైన్డ్ భూములకు పట్టాలు ఇవ్వాలని, రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, ప్రజా సమస్యలపై ఐక్యంగా పోరాడాలని కోరారు.