కీళ్ల నొప్పులను కొన్ని చిట్కాలతో తగ్గించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. గోరువెచ్చని నీటితో స్నానం చేయడం లేదా వేడి కాపడం పెట్టడం వంటివి చేస్తే మంచి ఫలితం ఉంటుంది. పసుపు, అల్లం వంటి యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ ఆహారాలు తీసుకోవాలి. రోజూ తేలికపాటి వ్యాయామం, వాకింగ్ చేయాలి. బరువు అదుపులో ఉంచుకోవాలి. నొప్పులు తగ్గకపోతే తప్పకుండా డాక్టర్‌ని సంప్రదించాలి.
ఆరోగ్యం
ఈ చిట్కాలతో కీళ్ల నొప్పులకు చెక్..!


