PDPL: మంథనిలో సంగీత పాఠశాలకు సొంత భవనం అందుబాటులోకి రావడం సంతోషకరమని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. మంత్రి శ్రీధర్ బాబు సూచనల మేరకు వినియోగంలో లేని మహిళా భవనాన్ని సంగీత పాఠశాలకు కేటాయించి, పునరుద్ధరణ పనులు చేపట్టినట్లు తెలిపారు. విద్యార్థులు అందుబాటులో ఉన్న మౌలిక వసతులను సద్వినియోగం చేసుకొని సంగీతం, నృత్యం తదితర రంగాలలో రాణించాలని సూచించారు.
తెలంగాణ
'పాఠశాలకు సొంత భవనం రావడం సంతోషకరం'


