ELR: ఉంగుటూరు మండలం నాచుగుంట జాతీయ రహదారి పక్కన ఉన్న ఏలూరు ప్రధాన కాలువ రేవు రోజురోజుకు పూడుకుపోతుంది. గుర్రపుడెక్క, చెత్త, మట్టితో నిండి రేవు ఉపయోగంలో లేకుండా పోయింది. దీనివల్ల రైతులు, ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నిసార్లు చెప్పినా అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. వెంటనే రేవును శుభ్రం చేసి పునరుద్ధరించాలని కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
పూడుకుపోతున్న కాలువ రేవు.. పట్టించుకోని అధికారులు


