హైదరాబాద్: 28°C
వార్తలు

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు

ఢిల్లీలో కేంద్ర కేబినెట్ పలు కీలక ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఇందులో రూ.11,000 కోట్లతో నిర్మాణ, మౌలిక సదుపాయాల పరికరాల తయారీ ఎకోసిస్టమ్ పథకం, తమిళనాడులోని కామరాజర్ పోర్టులో రూ.4,288 కోట్లతో రెండో కంటైనర్ టెర్మినల్, అసోంలోని సిల్చార్ వద్ద రూ.2,014కోట్లతో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణం ఉన్నాయి. అలాగే, తపాలాశాఖ కోసం రూ.1,141కోట్లతో పోస్టల్ ఆపరేషన్స్ పథకాలను పొడిగించారు.