హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల ఎఫెక్ట్.. పలు బస్సులు రద్దు

PPM: రేపు జరగనున్న పంచాయతీ ఎన్నికల కారణంగా కొన్ని పరిమిత బస్సు సర్వీసులు, పలు ప్రాంతాలకు సర్వీసుల రద్దు చేసినట్లు డిపో మేనేజర్ లక్ష్మణరావు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. విశాఖ, VZM, పాలకొండ, గుమ్మలక్ష్మీపురం, సాలూరుకు పరిమిత బస్సు సర్వీసులు ఉంటాయన్నారు. అలాగే, జమదాల, కొత్తపల్లి, చిన్నబుడ్డిడి, తాడికొండ,కొత్తూరు బస్సు సర్వీసులు రద్దు చేశామన్నారు.