ASR: పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలని పాడేరు సబ్ కలెక్టర్ సాహిత్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన కొయ్యూరు మండలంలో పర్యటించారు. ఎన్నికల పంపిణీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఎన్నికల అధికారులకు పలు సూచనలు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. రిటర్నింగ్ అధికారి వైవీ నరసింహారావు, ఎంపీడీవో జీడీవీ ప్రసాదరావు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి'


