హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జాతీయస్థాయి హాకీ పోటీలకు ఎంపిక

అన్నమయ్య: మదనపల్లె జడ్పీ హైస్కూల్ 8వ తరగతి విద్యార్థిని పావని జాతీయస్థాయి అండర్-14 హాకీ పోటీలకు ఎంపికైంది. హిందూపురంలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా జట్టుకు గోల్‌కీపర్‌గా అద్భుత ప్రతిభ కనబరిచింది. దీంతో రాష్ట్ర జట్టుకు ఎంపికై త్వరలో గ్వాలియర్‌లో జరిగే జాతీయ పోటీల్లో పాల్గొననుంది.