KRNL: అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లకు కనీస వేతనాలు పెంచాలని సీఐటీయూ నాయకుడు బి.రాముడు డిమాండ్ చేశారు. ప్రస్తుతం వర్కర్లకు రూ.11,500, హెల్పర్లకు రూ.7,000మాత్రమే అందుతోందని తెలిపారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం డిసెంబర్ 1నుంచి 3 వరకు ఢిల్లీలో జరిగే ఆందోళనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బి.తిమ్మప్ప పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'అంగన్వాడీ కార్మికులకు కనీస వేతనాలు పెంచాలి'


