హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ముస్లింలకు వైస్ ఛైర్మన్ పదవి ఇవ్వకపోవడంపై అసంతృప్తి

ప్రకాశం: మార్కాపురంలో మున్సిపల్ వైస్ ఛైర్మన్ పదవిని ముస్లిం మైనార్టీలకు కేటాయించకపోవడంపై మత పెద్దలు అసంతృప్తి వ్యక్తం చేశారు. జామియా మసీదులో సమావేశమైన వారు గత 40 ఏళ్లుగా కొనసాగుతున్న ఆనవాయితీని విస్మరించడం అన్యాయమన్నారు. 40 వార్డులకు గాను 10 మంది ముస్లిం కౌన్సిలర్లు గెలిచినా పదవి కేటాయించకపోవడం బాధాకరమని పేర్కొన్నారు.