హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బీజేపీ మండలాధ్యక్షుడిపై దాడిని ఖండించిన జిల్లా అధ్యక్షుడు

సత్యసాయి: లేపాక్షి బీజేపీ మండలాధ్యక్షుడు నరసింహమూర్తిపై జరిగిన దాడిని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు జీఎం శేఖర్ స్వామి ఖండించారు. ఈ ఘటనపై లేపాక్షిలో విలేకరుల సమావేశం నిర్వహించారు. రాజకీయ విభేదాలతో దాడులకు పాల్పడటం సరికాదని, నిందితుడిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.