TPT: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలను డిసెంబరు 6 నుంచి 14వ తేదీ వరకు వైభవంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ జేఈవో డా. ఏ. శరత్ తెలిపారు. ఉత్సవాల్లో చివరి రోజైన పంచమితీర్థానికి లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉందన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేపడుతున్నట్లు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
డిసెంబరు 6 నుంచి పద్మావతి బ్రహ్మోత్సవాలు


