హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

420 మంది చెంచులకు ఉచిత స్పర్శదర్శనం

NDL: శ్రీశైల దేవస్థానం ఆధ్వర్యంలో నెలలో చివరి బుధవారం నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా 420 మంది చెంచు గిరిజన భక్తులకు ఉచిత స్పర్శదర్శనం, అమ్మవారి దర్శనం కల్పించారు. చెంచులు సంప్రదాయ తప్పెట వాయిద్యాలు, నృత్యాలతో ఆలయానికి చేరుకోగా చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు, అధికారులు స్వాగతం పలికారు. దర్శనం అనంతరం అన్నప్రసాదాలు అందించారు.