హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న మఠాధిపతి

TPT: శ్రీ పద్మావతి అమ్మవారిని కర్ణాటక శ్రీ వ్యాసరాజ మఠాధిపతి శ్రీ విద్యాశీషతీర్థ స్వామీజీ బుధవారం దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు అధికారులు, అర్చకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం శటారి మర్యాదతో సత్కరించి అమ్మవారి దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఆలయ సంప్రదాయాల ప్రకారం స్వామీజీకి మర్యాదలు నిర్వహించారు.