హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రచారం ముగిసింది.. ప్రలోభాలు మొదలయ్యాయి

W.G: భీమవరం పురపాలక ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రం ముగిసింది. అయితే, ప్రచారం గడువు ముగియగానే నగదు పంపిణీ మొదలైనట్లు ప్రచారం జరుగుతోంది. ఛైర్‌పర్సన్‌, కౌన్సిలర్‌ అభ్యర్థుల వాటా కలిపి డబ్బులు పంచుతున్నట్లు కథనాలు వినిపిస్తున్నాయి. కొన్ని వార్డుల్లో ఓటుకు రూ.వెయ్యి వరకు పంచుతున్నట్లు సమాచారం. ఈ రహస్య పంపకాలపై పట్టణంలో జోరుగా చర్చ నడుస్తోంది.