హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కమిషనర్ ఆదేశాలతో కుక్కలు పట్టివేత

నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ ఆదేశాల మేరకు వెటర్నరీ వైద్యులు డాక్టర్ మదన్ మోహన్ నేతృత్వంలో బుధవారం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. వీధుల్లో సంచరిస్తూ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న శునకాలను నియంత్రించేందుకు ప్రజల నుంచి అందిన ఫిర్యాదుల ఆధారంగా చర్యలు చేపట్టారు. ఈ డ్రైవ్‌లో మొత్తం 11 కుక్కలను పట్టుకుని అనంతరం ఏబీసీ (ABC) కేంద్రానికి తరలించారు.