హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపటి ఎన్నికలకు పటిష్ట పోలీసు బందోబస్తు

అన్నమయ్య జిల్లా బీ.కొత్తకోట మున్సిపాలిటీ, సంబేపల్లి 9, రామాపురం 2 పంచాయతీల్లో గురువారం జరగనున్న ఎన్నికలకు ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాలతో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. డీఎస్పీలు కృష్ణమోహన్, ప్రసాద్ పర్యవేక్షణలో బలగాలు అప్రమత్తంగా ఉండి, ప్రశాంతంగా ఓటింగ్ జరిగేలా చర్యలు చేపట్టారు. ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలన్నారు.