ATP: జిల్లా సర్వజనాస్పత్రిలో టాయిలెట్ల వద్ద కనిపించిన సూట్‌కేసు కలకలం రేపింది. బాంబు ఉందనే వదంతులు సామాజిక మాధ్యమాల్లో వ్యాపించాయి. ఎస్సై రవి, సీఐ పుల్లయ్య పరిశీలించారు. కొద్దిసేపటికి కదిరి యువకుడు వచ్చి తన సూట్‌కేసుగా చెప్పాడు. తల్లి డెత్ సర్టిఫికెట్ కోసం వచ్చి అక్కడ ఉంచానని తెలిపాడు. తెరిచి చూడగా దుస్తులు ఉండటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
జీజీహెచ్‌లో సూట్‌కేసు కలకలం


