ASR: గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ అధికారులకు (పీవోలకు) అనంతగిరి మండల పరిషత్ కార్యాలయంలో శిక్షణ ఇచ్చారు. మండల రిటర్నింగ్ అధికారి డా. స్వామినాయుడు ఎన్నికల నిర్వహణ, పోలింగ్ విధానం, అధికారుల బాధ్యతలపై అవగాహన కల్పించారు. ఎన్నికలను పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు అందరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
పోలింగ్ అధికారులకు శిక్షణ


