PLD: దాచేపల్లి(M) గామాలపాడులో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎస్సీ వర్గీయులపై ఎన్నికల ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి వర్గీయులు దాడి చేయడంతో వివాదం చోటు చేసుకుంది. ఈ దాడిలో 5గురు ఎస్సీ వర్గీయులకు గాయాలుకాగా, ఆస్పత్రికి తరలించారు. జంగా కుటుంబానికి మద్దతు తెలపలేదని దాడి చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
పల్నాడు జిల్లా గామాలపాడులో తీవ్ర ఉద్రిక్తత


