హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గోతులమయంగా ఎన్ఏడీ-బాజీ జంక్షన్ రోడ్డు

VSP: ఎన్ఏడీ ఫ్లైఓవర్‌ నుంచి బాజీ జంక్షన్‌ వరకు రహదారి గోతులమయంగా మారింది. నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగించే ఈ మార్గంలో గోతుల కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా రాత్రివేళ ప్రమాదాల ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జీవీఎంసీ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు స్పందించి గోతులను తక్షణమే పూడ్చాలని స్థానికులు కోరుతున్నారు.