హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాష్ట్రస్థాయి పోటీల్లో తిరుచానూరు విద్యార్థిని సత్తా

TPT: అనంతపురంలో ఆంధ్రప్రదేశ్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (APSGF) ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సాఫ్ట్ టెన్నిస్ పోటీల్లో తిరుచానూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని మోటుపల్లి చాందిని విజేతగా నిలిచింది. 70వ జాతీయ స్కూల్ గేమ్స్ ఎంపిక పోటీల్లో భాగంగా అండర్‌-14 విభాగంలో తన ఆటతీరుతో ప్రతిభ చాటింది. ఈ విజయంతో పాఠశాల ఉపాధ్యాయులు, స్థానికులు ఆమెను అభినందించారు.