BPT: పంచాయతీ ఎన్నికలు గురువారం జరగనున్న నేపథ్యంలో కారంచేడులోని ఓ ప్రైవేట్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రాన్ని కలెక్టర్ వినోద్ కుమార్ బుధవారం పరిశీలించారు. ఎన్నికల విధుల్లో పాటించాల్సిన నిబంధనలపై పీవో, ఏపీవో, ఓపీవోలకు కీలక సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో ఎస్. నరసింహారావు, తహశీల్దార్ మాధవిలత, ఎంపీడీవో నేతాజీ పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్


