హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఏపీజీఈఏ జిల్లా వైస్ ప్రెసిడెంట్‌గా కుసుమకుమారి

అన్నమయ్య: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా వైస్ ప్రెసిడెంట్‌గా కుసుమకుమారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మదనపల్లెలో జరిగిన ఎన్నికల్లో గురుప్రసాద్ అధ్యక్షుడిగా, ఉమాశంకర్ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. వైద్య ఆరోగ్య శాఖలో 30 ఏళ్లుగా సేవలందిస్తున్న కుసుమకుమారి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.