హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పెండింగ్ వేతనాలు వెంటనే విడుదల చేయాలి'

PPM: రాష్ట్రవ్యాప్తంగా ఏపీ మోడల్ స్కూల్స్‌లో పనిచేస్తున్న ఇన్‌స్ట్రక్టర్లకు పెండింగ్‌లో ఉన్న గౌరవ వేతనాలను వెంటనే విడుదల చేయాలని ఉత్తరాంధ్ర గిరిజన సంఘం ప్రధాన కార్యదర్శి పాలక రంజిత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని 164 ఏపీ మోడల్ స్కూల్స్‌లో ఇటీవల 128 మంది ఇన్‌స్ట్రక్టర్లను అతిథి ఉపాధ్యాయులుగా ప్రభుత్వం నియమించిందని అన్నారు.