హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నాలుగు పంచాయతీల ఏకగ్రీవాలపై వైసీపీ అభ్యంతరం

ప్రకాశం: కొమరోలు మండలంలోని దద్దవాడ, తాటిచెర్ల, నల్లగుంట్ల, ఎడమకల్లు పంచాయతీల ఏకగ్రీవాలపై వైసీపీ ఇంచార్జ్ నాగార్జున రెడ్డి బుధవారం అభ్యంతరం వ్యక్తం చేశారు. టీడీపీ ఒత్తిళ్లు, పోలీసుల వేధింపులతో అభ్యర్థులు అజ్ఞాతంలోకి వెళ్లారని ఆరోపించారు. అభ్యర్థుల ప్రమేయం లేకుండానే నామినేషన్లు ఉపసంహరించుకున్నట్లు ప్రకటించారని పేర్కొంటూ కలెక్టర్, డీఆర్ఓలకు వినతిపత్రం అందజేశారు.