KRNL: ఆదోని పట్టణంలో సర్పంచ్ ఎన్నికల నిర్వహణకు అధికారులు బుధవారం అన్ని ఏర్పాట్లు చేపట్టారు. ఈ సందర్బంగా పోలింగ్ కేంద్రాలకు సిబ్బందిని కేటాయించి విధులు అప్పగించారు. అనంతరం ఎన్నికల సామగ్రి, బ్యాలెట్ బాక్సులు, అవసరమైన పత్రాలు అందజేశారు. ఆర్డీఓ అరుణాదేవి సిబ్బందికి ఎన్నికల విధులపై పలు సూచనలు చేశారు. పోలింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించేలా అవగాహన కల్పించారు.
ఆంధ్రప్రదేశ్
సర్పంచ్ ఎన్నికలకు సర్వం సిద్దం


