హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఓటర్లకు మిక్సీలు.. పోలీసుల తనిఖీలు

కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురంలో సర్పంచ్ ఎన్నికల వేళ ఓటర్లకు పంచేందుకు వాహనంలో తీసుకొస్తున్న మిక్సీలను సర్పవరం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోటీలో ఉన్న అభ్యర్థులు ప్రలోభాలకు గురి చేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో అందిన సమాచారంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. వాహనాన్ని స్టేషన్‌కు తరలించి, అందులోని వస్తువులను పరిశీలిస్తున్నారు.