హైదరాబాద్: 28°C
వార్తలు

అగ్నిప్రమాదం.. గ్రామంలో 20కి పైగా ఇళ్లు దగ్ధం

ఉత్తరాఖండ్ ఉత్తరకాశీ జిల్లాలోని పంవాణి గ్రామంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా చెలరేగిన మంటలు క్షణాల్లోనే ఊరంతా వ్యాపించడంతో 20కి పైగా ఇళ్లు కాలి బూడిదయ్యాయి. ఈ గ్రామం కొండపై ఉండడంతో అగ్నిమాపక సిబ్బంది రావడానికి ఆలస్యం కాగా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అయితే ప్రాణ నష్టం వివరాలతో పాటు ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.