చిరుతపై కుక్క ప్రతీకారం తీర్చుకున్న ఘటన మహారాష్ట్ర బీడ్ జిల్లాలో జరిగింది. అడవి సమీపంలో ఉండే గ్రామంలో ఒక కుక్క పిల్లలను చిరుత చంపేసింది. దీంతో తల్లడిల్లిన తల్లి శునకం.. ఏడాది వయసున్న చిరుత పిల్లపై దాడి చేసింది. దీంతో ఆ కూన మరణించింది. ఇది ప్రతీకార చర్యేనని గ్రామస్థులు చెబుతున్నారు. అయితే తల్లి చిరుత ఎక్కడ దాడి చేస్తుందోనని భయపడుతున్నారు. ఈ ఘటనపై అటవీ అధికారులు విచారిస్తున్నారు.
వార్తలు
తన పిల్లలను చంపిన చిరుతపై కుక్క ప్రతీకారం


