హైదరాబాద్: 28°C
వార్తలు

కశ్మీర్‌లో పెరిగిన చలి తీవ్రత

కశ్మీర్ లోయలో చలి తీవ్రత పెరిగింది. ఈ సీజన్‌లో తొలిసారి ఉష్ణోగ్రతలు మైనల్ డిగ్రీలను తాకాయి. పహల్గామ్‌లో -4.6 డిగ్రీలు, దక్షిణ కశ్మీర్‌లోని షోపియాన్‌లో -4.1, ఖాజీగుండ్‌లో -2, లోయలో -1.6 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. అలాగే బారాముల్లాలో 0.2 డిగ్రీలు నమోదైంది. మంచు కురుస్తుండడంతో కశ్మీర్ అందాలను తిలకించేందుకు పర్యాటకులు భారీ ఎత్తున అక్కడకు వెళ్తున్నారు.