హైదరాబాద్: 28°C
వార్తలు

తొలి విడతలో 18% పంచాయతీలు ఏకగ్రీవం

AP: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాల జోరు కనిపించింది. ఎన్నికలు జరిగే 3,949 గ్రామ పంచాయతీల్లో 707(17.90%) పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఆయా గ్రామాల్లో సర్పంచులతో పాటు వార్డు సభ్యులంతా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అత్యధికంగా తిరుపతి జిల్లాలో 130 పంచాయతీలు ఏకగ్రీవం కాగా.. అల్లూరి, తూర్పు గోదావరి, NTR జిల్లాల్లో అత్యల్పంగా ఒక్కో పంచాయతీ మాత్రమే ఏకగ్రీవమైనట్లు అధికారులు వెల్లడించారు.