హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పారామెడికల్ కోర్సుల ప్రవేశాలకు కౌన్సెలింగ్

ATP: అనంతపురం జిల్లాలోని ప్రైవేట్ కళాశాలల్లో పారామెడికల్ కోర్సుల ప్రవేశాల కోసం ఈ నెల 26న కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఉదయం 10.30 గంటలకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో జరిగే కౌన్సెలింగ్‌కు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు హాజరు కావాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రవేశాల కోసం మొత్తం 117 మంది దరఖాస్తు చేసుకున్నారని పేర్కొన్నారు.