ATP: అనంతపురం గ్రామీణంలోని కక్కలపల్లి మార్కెట్‌లో బుధవారం టమాట ధరలు పెరిగాయి. మార్కెట్‌లో 1,400 టన్నుల టమాట విక్రయాలు జరిగాయి. కిలో గరిష్ఠ ధర రూ.40, మధ్యస్థ ధర రూ.30, కనిష్ఠ ధర రూ.20 పలికింది. 15 కిలోల బుట్ట గరిష్ఠంగా రూ.600, మధ్యస్థంగా రూ.450, కనిష్ఠంగా రూ.300 పలికినట్లు మార్కెట్ ఇన్‌ఛార్జ్ మల్లిక తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
మార్కెట్‌లో పెరిగిన టమాట ధరలు


