నెల్లూరు ఫతేఖాన్పేట రైతుబజార్ వెనుక ఉన్న ఓ ఇంట్లో అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఏసీలోని గ్యాస్ పేలింది. ఈ ప్రమాదంలో ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. శరీరం సుమారు 75 శాతం కాలిపోయింది. వెంటనే స్పందించిన స్థానికులు బాధితురాలిని సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
అగ్ని ప్రమాదం.. మహిళకు గాయాలు


