హైదరాబాద్: 28°C
వార్తలు

AI వినియోగంలో భారత ఉద్యోగులు టాప్

భారత ఉద్యోగుల్లో ఏకంగా 96% మంది ఏఐని రోజూ లేదా వారానికి 2,3 సార్లు వినియోగిస్తున్నారని బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (BCG) నివేదిక వెల్లడించింది. AI వినియోగంలో 9 ఆసియా-పసిఫిక్ దేశాల్లో భారత్‌ అగ్రస్థానంలో నిలిచింది. AI వాడకం వల్ల భారత ఉద్యోగులకు వారానికి సగటున 15 గంటల సమయం ఆదా అవుతోందని తెలిపింది. ఇందులో 61% మంది ఆదా అయిన సమయాన్ని అదనపు పనుల కోసం వాడుతున్నారని వెల్లడించింది.