NLR: ఉదయగిరి సమీపంలోని దుర్గం అటవీ ప్రాంతంలో పురాతన శివలింగం బయటపడింది. జీవాల కాపర్లు గుర్తించిన శివలింగానికి తాత్కాలిక పందిరి ఏర్పాటు చేశారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా శివమాల ధరించిన భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ప్రాంతంలో శ్రీకృష్ణదేవరాయల కాలంలో 365 ఆలయాలు, కోనేరులు ఉండేవని స్థానిక పెద్దలు చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
దుర్గం అడవిలో పురాతన శివలింగం


