హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: కొత్తపేటలో జోరుగా ఎన్నికల ప్రచారం

కోనసీమ: కొత్తపేట గ్రామ పంచాయతీ కూటమి సర్పంచ్ అభ్యర్థి యల్లమెల్లి సందీప్ బుధవారం ఏనుగుమహల్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికీ వెళ్లిన ఆయనకు ఓటర్లు హారతులతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వంకాయ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని సందీప్ కోరారు. విజయం సాధించిన వెంటనే గ్రామంలోని సమస్యలను గుర్తించి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.