హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పెరవలి సర్పంచ్‌గా పుచ్చకాయల రాధ

ATP: సింగనమల మండలం పెరవలి గ్రామ సర్పంచ్‌గా పుచ్చకాయల రాధ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం ఆమె అనంతపురం మాజీ మేయర్ మదమంచి స్వరూపను ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా స్వరూప ఆమెకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసి అభినందించారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, గ్రామ అభివృద్ధికి అంకితభావంతో సేవలందించాలని ఆమె ఆకాంక్షించారు.