హైదరాబాద్: 28°C
వార్తలు

ఢిల్లీలో దలైలామాకు బంగ్లా కేటాయింపు

టిబెట్ బౌద్ధమత అత్యున్నత గురువు దలైలామా వారసుడి ఎంపిక విషయంలో కీలక చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో దలైలామాకు లుటియన్స్  ప్రాంతంలో సైలెంట్‌గా బంగ్లాను కేటాయించింది. పండిట్ రవిశంకర్ శుక్లా లేన్‌లో ఓ నివాసాన్ని ఇచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. విదేశాంగ శాఖ  విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.