హైదరాబాద్: 28°C
క్రీడలు

ఐవోఏ అధ్యక్ష రేసు నుంచి తప్పుకున్న పీటీ ఉష

భారత ఒలింపిక్ సంఘం (ఐవోఏ) అధ్యక్ష రేసు నుంచి పీటీ ఉష తప్పుకుంది. అధ్యక్ష పదవికి నామినేషన్ల దాఖలు గడువు మంగళవారంతో ముగిసింది. అయితే, ప్రస్తుత అధ్యక్షురాలిగా ఉన్న పీటీ ఉష నామినేషన్ దాఖలు చేయలేదు. దీంతో ఆమె ఎన్నికల బరిలో లేనట్లయింది. అధ్యక్ష పదవి కోసం షూటర్ గగన్ నారంగ్, భారత ఆర్చరీ సంఘం కార్యదర్శి వీరేంద్ర సచ్‌దేవ, ఐవోఏ మాజీ కార్యదర్శి రాజీవ్ మెహతా పోటీలో ఉన్నారు.