హైదరాబాద్: 28°C
క్రీడలు

వైభవ్ సూర్యవంశీ.. తరానికొక్కడు: సెహ్వాగ్

వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర ఇన్నింగ్స్‌పై మాజీ క్రికెటర్లు ప్రశంసలు కురిపించారు. 'వైభవ్.. క్రికెట్ చరిత్రలో కొత్త రికార్డులను సృష్టించేందుకు చూస్తున్నాడు. సూపర్ స్టార్ సిద్ధమవుతున్నాడు' అని మహ్మద్ కైఫ్ ట్వీట్ చేశాడు. 'ఇది నమ్మశక్యం కాని విషయం. వైభవ్.. తరానికొక్కడు' అని సెహ్వాగ్ కొనియాడాడు. 'వర్ణించడానికి పదాలు సరిపోవడం లేదు. ఇలాగే దేశానికి గర్వకారణంగా నిలవాలి' అని బద్రినాథ్ ప్రశంసించాడు.