హైదరాబాద్: 28°C
తెలంగాణ

అభివృద్ది పనుల ప్రారంభోత్సవాలు

BDK: బూర్గంపహాడ్ మండలంలో బుధవారం అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు జరగనున్నాయి. వేపలగడ్డలో రూ.20 లక్షలతో నిర్మించిన గ్రామపంచాయతీ భవనం, పోలవరంలో రూ.12 లక్షలతో ఏర్పాటు చేసిన అంగన్‌వాడీ కేంద్రాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.