ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం లాలాపురంలో విషాద ఘటన చోటుచేసుకుంది. భర్త మరణంతో మనోవేదనకు గురైన షేక్ రంజాన్బీ ఇద్దరు కుమారులకు విషం ఇచ్చి తానూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం. చికిత్స పొందుతూ మంగళవారం ఆమెతో పాటు చిన్న కుమారుడు నహీం మృతి చెందారు. పెద్ద కుమారుడు హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్నాడు. ఎస్ఐ హరిత కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తెలంగాణ
విషాదం..తల్లి, కుమారుడు మృతి


