హైదరాబాద్: 28°C
తెలంగాణ

అనుమానస్పద స్థితిలో వ్యక్తి మృతి

BDK: భద్రాచలం, అశోక్‌నగర్ కాలనీలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. స్థానికుడు కె.మహేష్ కొంతకాలంగా ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాడు. మంగళవారం ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పరిశీలించగా మృతదేహం కనిపించింది. అప్పటికే వీధి కుక్కలు మృతదేహాన్ని పీక్కుతింటుండటంతో వాటిని తరిమేశారు. మృతుడి సోదరుడి ఫిర్యాదుతో ఎస్ఐ రాజేష్ కేసు నమోదు చేసారు.