హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆదివాసీ గిరిజన సంఘం కార్యవర్గం ఎన్నిక

నిర్మల్ జిల్లా తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం (TAGS) నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా ఆత్రం డానియల్, ప్రధాన కార్యదర్శిగా తొడసం శంభు, కోశాధికారిగా సోనిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మొత్తం 17 మందితో జిల్లా కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి సంఘం రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ పూసం సచిన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నూతనంగా ఎన్నికైన నాయకులను ఆయన అభినందించారు.