హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాష్ట్ర కాంగ్రెస్ ఇంఛార్జితో ఎమ్మెల్యే భేటీ

MBNR: జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి మంగళవారం రాత్రి ప్రజాభవన్‌లో ఏఐసీసీ కార్యదర్శి, రాష్ట్ర కాంగ్రెస్ ఇంఛార్జి బీఎం సందీప్‌తో భేటీ అయ్యారు. పార్టీ అంతర్గత సమస్యలు, నాయకుల సమన్వయంపై చర్చించారు. బహిరంగ విమర్శలు చేయవద్దని సందీప్ సూచించగా, ఇకపై అలాంటి వ్యాఖ్యలు చేయబోమని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. సమస్యలను పరిష్కరిస్తామని సందీప్ భరోసా ఇచ్చారు.