హైదరాబాద్: 28°C
వార్తలు

టీవీకే ప్రభుత్వంపై అన్నామలై మండిపాటు

తమిళనాడు తిరుప్పరకుండ్రం దీప స్తంభం కేసులో టీవీకే ప్రభుత్వంపై ఆ రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయస్థానాల తీర్పులను పట్టించుకోకుండా ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. సీఎం విజయ్‌ను ఆయన చుట్టూ ఉన్నవారు తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. కోర్టు తీర్పులను సీఎం నిజాయితీగా అమలు చేసినప్పుడే న్యాయం గెలుస్తుందని సూచించారు.