హైదరాబాద్: 28°C
తెలంగాణ

పూజారి ఇంట్లో జింక చర్మం లభ్యం

ADB: ఆదిలాబాద్‌లోని రిక్షా కాలనీ‌కు చెందిన పూజారి గంగాధర్ ఇంట్లో టూ టౌన్ పోలీసులు తనిఖీలు నిర్వహించగా పూజ గదిలో జింక చర్మం లభించింది. విచారణ చేపట్టగా 2020లో కర్ణాటక అటవీ ప్రాంతంలో ఓ వ్యక్తి వద్ద కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. జింక చర్మంపై కూర్చొని పూజలు చేస్తే దుర్గామాత అనుగ్రహం కలుగుతుందని, దైవంతో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తానని నమ్మిస్తూ భక్తులను మోసం చేస్తున్నట్లు SI ప్రణయ్ తెలిపారు.